స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన

ABN , First Publish Date - 2022-12-31T00:03:22+05:30 IST

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలో గల సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో శుక్రవారం కళాశాలకు చెందిన ఇందిక బృందం బాలికల అభ్యున్నతిపై, మహిళల స్వీయరక్షణ సాధికారతపై అవగాహన కల్పించారు.

స్వీయ రక్షణపై మహిళలకు అవగాహన

మేడ్చల్‌, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలో గల సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో శుక్రవారం కళాశాలకు చెందిన ఇందిక బృందం బాలికల అభ్యున్నతిపై, మహిళల స్వీయరక్షణ సాధికారతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో గిన్నిస్‌ రికార్డ్‌ హోల్డర్‌, బ్లాక్‌ బెల్ట్‌ సాయిదీపక్‌ విద్యార్థినులకు రక్షణ విధానాలపై నేర్పించాడు. కళాశాల సెక్రటరీ శ్రీశైలంరెడ్డి, ప్రిన్స్‌పాల్‌ ఎ.శ్రీనివాసులరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐటీ విభాగం హెచ్‌ఓడీ మాధవి, ఎస్‌.పుంగోడి, సునీతారాణి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు.

Updated Date - 2022-12-31T00:03:22+05:30 IST

Read more