శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అవార్డులు

ABN , First Publish Date - 2022-09-27T04:46:32+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్ర యానికి

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు అవార్డులు
అవార్డులను అందుకుంటున్న జీఎంఆర్‌ ప్రతినిధులు

శంషాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 26: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్ర యానికి నేషనల్‌ ఎనర్జీ లీడర్‌, ఎక్స్‌లెన్స్‌ ఎనర్జీ ఎఫీషియెంట్‌ అవార్డు దక్కాయని జీంఎఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు సోమవారం ఒక ప్రక టనలో పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇండస్ట్రీ గోద్రెజ్‌ గ్రీన్‌ బిజినెస్‌ సెంటర్‌ (జీబీసీ) సంస్థ అవా ర్డులను ప్రదానం చేసినట్లు అధికా రులు తెలిపారు. ఈ సందర్భంగా జీఎంఆర్‌ అధికారులు మాట్లాడుతూ.. ఆగస్టు 22-25మధ్య  నిర్వహించిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సమ్మిట్‌లో ఈ అవార్డులను ప్రకటించినట్లు తెలిపారు. అవార్డులను అందుకోవడం ఇది నాలుగోసారి అని, పారిశ్రామిక ప్రముఖుల మధ్య గెయిల్‌ చీఫ్‌ ప్రాజ్రెక్ట్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ ఆఫీసర్‌ విజయరాథోడ్‌, ఏజీఎం ఎలక్ట్రికల్‌ ఆఫీసర్‌ బిక్షం భూక్యాం అవార్డులను అందుకున్నారు. సుస్థిర ఇంధన సామర్థ్య చర్యలు, సహజ ఇంధన వనరుల వినియోగించడం వల్ల ఈ అవార్డులు కైవసం చేసుకున్నట్లు తెలిపారు. 2040 నాటికి నెట్‌జీరో కర్బాన్‌ సంస్థగా మారాలన్నదే తమ లక్ష్యమని జీఎంర్‌ సీఈవో ప్రదీప్‌ఫణీకర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎంఆర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.  Read more