ఆటో-బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం
ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST
ఆటో-బైక్ ఢీ.. వ్యక్తి దుర్మరణం
షాద్‌నగర్ రూరల్, అక్టోబరు 17: షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంట్లవెల్లి సమీపంలో సోమవారం మధ్యా హ్నం ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు సీఐ నవీన్‌కుమార్ తెలిపారు. మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన శవ(35) చటాన్‌పల్లి శివారులో ఉన్న వసతి గృహంలో తన కుమారుడిని వదిలి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా గంట్లవెల్లి సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నాడు. దీంతో శివ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.