సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. టీఆర్‌ఎస్‌లోకి వలసలు

ABN , First Publish Date - 2022-08-15T05:47:08+05:30 IST

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. టీఆర్‌ఎస్‌లోకి వలసలు

సంక్షేమ పథకాలకు ఆకర్షితులై.. టీఆర్‌ఎస్‌లోకి వలసలు
ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరుతున్ననారాయణపూర్‌ నాయకులు

  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 
  • పార్టీలో కాంగ్రెస్‌ నాయకుల చేరిక 

పరిగి, ఆగస్టు 14 : ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన వారు టీఆర్‌ఎ్‌సలో చేరుతున్నారని ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపూర్‌కు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో ఆయన నివాసంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈమేరకు పరిగి మండలం నారాయణపూర్‌ మాజీ సర్పంచ్‌ జి.వెంకటయ్య, వార్డు మెంబర్లు పొట్ట రవి, బేగరి సాయిలు, నాయకులు పి.అనంతయ్య, రాజు, నర్సింహా, మొగులయ్య, సత్తయ్య, శేఖర్‌, బాబు, నర్సయ్య, చిన్నసాయిలు, రాజేశ్‌, వెంకటయ్య, ఆటో శివ, కుమార్‌ తదితరులు కాంగ్రె్‌సకు రాజీనామా చేసి టీఆర్‌ఎ్‌సలో చేరారు. అనంతరం ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, దీంతో ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎ్‌సలోకి వలసలు పెరిగాయని అన్నారు. ఏ పార్టీ నుంచి వచ్చిన వారికైనా టీఆర్‌ఎస్‌ స్వాగతం పలుకుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపీపీ అరవింద్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ సురేందర్‌, నాయకులు ఆర్‌.ఆంజనేయులు, బి.ప్రవీణ్‌రెడ్డి, పి.రాంచంద్రయ్య, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more