రిపోర్టర్లపై దాడి.. ముగ్గురిపై కేసు
ABN , First Publish Date - 2022-12-15T00:15:22+05:30 IST
విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్లపై దాడికి పాల్పడిని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.
పరిగి రూరల్, డిసెంబరు 14: విధి నిర్వహణలో ఉన్న రిపోర్టర్లపై దాడికి పాల్పడిని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగి పట్టణంలోని జేడీహెచ్ ప్రైవే ట్ పాఠశాల యాజమాన్యం విద్యార్థులచే పనులు చేయిస్తున్నారని తెలుసుకున్న పలువురు రిపోర్టర్లు అక్కడికి వెళ్లారు. ఈమేరకు విద్యార్థులు బల్లలు మోస్తున్న దృశ్యాలను కెమెరాలో చిత్రీకరిస్తుండగా పాఠశాల యాజమాన్యం రిపోర్టర్లపై దాడికి దిగారు. ఇందుకు నిరసనగా బుధవారం పరిగి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట రిపోర్టర్లు ధర్నా చేపట్టారు. దాడి చేసిన వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాడ్ చేశారు. అనంతరం పరిగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో దాడికి పాల్పడిన సిద్దిఖీ, తౌఫిక్, షఫీలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.