సినీ రచయిత చిన్నికృష్ణపై దాడి

ABN , First Publish Date - 2022-02-20T04:08:26+05:30 IST

సినీ రచయిత చిన్నికృష్ణపై దాడి

సినీ రచయిత చిన్నికృష్ణపై దాడి

చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు 

శంకర్‌పల్లి, ఫిబ్రవరి 19: తనపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సినీ రచయిత చిన్నికృష్ణ శంకర్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా చిన్నికృష్ణ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని మోకిల గ్రామంలో గలసార్క్‌వన్‌లో గల తన విల్లా పక్కన ఉన్న గ్రామపంచాయతీ స్థలాన్ని కబ్జా చేశావంటూ కొందరు తన ఇంట్లోకి చొరబడి దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తనపై దాడి చేసిన  కమ్యూనిటీ ఈసీ మెంబర్‌ వేణు మాధవ్‌, దీపక్‌ కీని, తరుణ్‌ మేకలు వారి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తానుఏ భూమినీ కబ్జా చేయలేదని, సర్పంచ్‌, కార్యదర్శి విల్లాపక్కన ఉన్న ఖాళీస్థలాన్ని చెట్లు , రోడ్డు వేసుకోవాలని తెలిపారని, ఈ విషయంపై హైకోర్టులో కేసు వేస్తే తనకు అనుకూలంగానే తీర్పు వచ్చిందని తెలిపారు. తాను కొవిడ్‌తో బాధపడుతుంటే అదేమీ పట్టించుకోకుండా తనపై దాడి చేసి ఇంట్లో ఉన్న 150 గ్రాముల బంగారం, రూ.5లక్షల విలువ గల డైమండ్‌ రింగ్‌, తనతండ్రి ఎంతో ప్రేమతో ఇచ్చిన కలాన్ని(పెన్‌) దొంగిలించారని ఆయన ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం చేవెళ్ల ఏసీపీ రవీందర్‌రెడ్డి, శంకర్‌పల్లి సీఐ మహేష్‌ గౌడ్‌, ఎస్‌ఐ కృష్ణలు సంఘటనాస్థలానికి చేరుకుని దాడి జరిగిన తీరు పరీశీలించారు. దాడికి పాల్పడ్డ వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Read more