కమీషన్‌ అడిగాడని వ్యక్తిపై దాడి

ABN , First Publish Date - 2022-12-31T00:02:41+05:30 IST

భూమి ఇప్పించిన తనకు కమిషన్‌ ఇవ్వాలని కోరినందుకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, విద్య, మౌలిక వసతుల కల్పన సంస్థ మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, ఆయన కుమారుడు, మాజీ కౌన్సిలర్‌ విజేందర్‌గౌడ్‌ తనను కాలితో తన్ని దాడిచేశారని గోవిందరాజు అనే వ్యక్తి వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు.

కమీషన్‌ అడిగాడని వ్యక్తిపై దాడి

విద్య, మౌలిక వసతుల కల్పన సంస్థ మాజీ చైర్మన్‌, ఆయన కుమారుడి దౌర్జన్యం

పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు

భూమి కొనుగోలు విషయంలో ఘటన

వికారాబాద్‌, డిసెంబరు 30: భూమి ఇప్పించిన తనకు కమిషన్‌ ఇవ్వాలని కోరినందుకు బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, విద్య, మౌలిక వసతుల కల్పన సంస్థ మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, ఆయన కుమారుడు, మాజీ కౌన్సిలర్‌ విజేందర్‌గౌడ్‌ తనను కాలితో తన్ని దాడిచేశారని గోవిందరాజు అనే వ్యక్తి వికారాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉంటే తమను తిట్టి, తమ పొలంలో కడీలను ధ్వంసం చేశాడని నాగేందర్‌గౌడ్‌, విజేందర్‌గౌడ్‌లు గోవిందరాజుపై ఎదురు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి వివరాలి ఉన్నాయి. ధారూరు బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు గోవిందరాజు.. నాగేందర్‌గౌడ్‌కు బంధువు. ఈ క్రమంలోనే నాగేందర్‌గౌడ్‌కు మధ్యవర్తిగా ఉండి మూడేళ్ల కింద ధారూరు పరిధిలో రెండెకరాల భూమిని ఇప్పించాడు. ఈ వ్యవహారంలో తనకు కమీషన్‌ ఇవ్వాలని గోవిందరాజు అడుగుతూ వస్తున్నాడు. శుక్రవారం కమీషన్‌ ఇస్తానని గోవిందరాజును నాగేందర్‌గౌడ్‌ తన కార్యాలయానికి పిలిపించాడు. అనంతరం తనను దూషించి.. తన కొడుకు విజేందర్‌గౌడ్‌తో కలిసి బూటు కాలితో దాడి చేశారని గోవిందరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై దాడి చేసిన నాగేందర్‌గౌడ్‌, విజేందర్‌గౌడ్‌లపై చర్యలు తీసుకోవాలని గోవిందరాజు డిమాండ్‌ చేశారు. ఈ విషయమై నాగేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. భూమి కొనుగోలు సమయంలో పట్టాదారులైన అన్నదమ్ముల మధ్య పంచాయితీ ఉండేదన్నారు. ఆ సమయంలో గోవిందరాజు తమకు సహకరించాడని, అప్పటి నుంచి భూ కొనుగోలులో కమీషన్‌ ఇవ్వాలని ఇబ్బంది పెడుడుతున్నాడని అన్నారు. పొలంలో కడీలను సైతం ధ్వంసం చేశాడన్నారు. తన కార్యాలయానికి మను దూషించాడని, గోవిందరాజుపై తాము దాడిచేయలేదని చెప్పారు. గోవిందరాజుపై ధారూరు, వికారాబాద్‌ పీఎ్‌సలలో ఫిర్యాదు చేశామని నాగేందర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-12-31T00:02:41+05:30 IST

Read more