షార్‌ ్టసర్క్యూట్‌తో ఏటీఎంలు దగ్ధం

ABN , First Publish Date - 2022-05-27T05:02:05+05:30 IST

షార్‌ ్టసర్క్యూట్‌తో ఏటీఎంలు దగ్ధం

షార్‌ ్టసర్క్యూట్‌తో ఏటీఎంలు దగ్ధం
ఏటీఎంల గదిలో ఎగిసిపడుతున్న మంటలు

  •  కాలిపోయిన ఐసీఐసీఐ ఆటోమెటెడ్‌ టెల్లార్‌ మిషన్లు 
  •  మంటాలార్పిన ఫైర్‌ సిబ్బంది 
  •  జోడిమెట్లలో ఘటన

ఘట్‌కేసర్‌రూరల్‌, మే26 : విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌తో మూడు ఏటీఎంలు పూర్తిగా దగ్ధ్దమైన సంఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోచారం మునిసిపాలిటీ, జోడిమెట్ల చౌరస్తాలోని ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని గదిలో మూడు ఐసీఐసీఐ బ్యాంకు  ఏటీఎంలు ఉన్నాయి. గురువారం సాయంత్రం ఏటీఎంలు ఉన్నగదిలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకుని మంటలు ఎగసి పడుతుండటంతో స్థానికులు బయటకు పరుగులు తీశారు. సమీప దుకాణదారులు మంటలు అంటుకుంటాయనే భయంతో  మూసివేశారు. సమాచారం అందుకున్న ఘట్‌కేసర్‌ సీఐ చంద్రబాబు సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోని స్థానికుల సహకారంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఏటీఎంల పక్కనే ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎంత నష్టం జరిగిందనే వివరాలు బ్యాంకు అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2022-05-27T05:02:05+05:30 IST