ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఎస్‌ఐకి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2022-12-07T00:04:29+05:30 IST

ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఏఎ్‌సఐకి తీవ్రగాయాలైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.

ఆర్టీసీ బస్సు ఢీకొని ఏఎస్‌ఐకి తీవ్ర గాయాలు

ఆదిభట్ల, డిసెంబరు 6: ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఏఎ్‌సఐకి తీవ్రగాయాలైన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్‌లో ఏఎ్‌సఐగా విధులు నిర్వర్తిస్తున్న కొర్ర కేస్యానాయక్‌ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేయడానికి బైక్‌పై ఇంజాపూర్‌లోని తన ఇంటికి వెళ్తున్నాడు. యాంజాల మాసాబ్‌ చెర్వుకట్టపై దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. తలకు తీవ్రగాయం కావడంతో నగరంలోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఏఎ్‌సఐ కుమారుడి ఫిర్యాదు మేరకు ఆర్టీసీ డ్రైవర్‌ మహబూబ్‌అలీపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.

Updated Date - 2022-12-07T00:04:30+05:30 IST