ఆసరా పథకం నిరుపేదలకు వరం

ABN , First Publish Date - 2022-10-08T04:05:36+05:30 IST

ఆసరా పథకం నిరుపేదలకు వరం

ఆసరా పథకం నిరుపేదలకు వరం
తిమ్మాపురంలో సర్పంచ్‌ జి.గోపాల్‌రెడ్డితో కలసి లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఎంపీపీ మంద జ్యోతి

కందుకూరు, అక్టోబరు 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆసరా పథకం పేదలకు వరంగా మారిందని ఎంపీపీ మంద జ్యోతి అన్నారు.  మండలంలోని తిమ్మాపురం గ్రామంలో 94మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పింఛన్‌ కార్డులను ఎంపీపీ శుక్రవారం అందజేశారు. సర్పంచ్‌ గంగాపురం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో గ్రామంలో అర్హులకు పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. కంప్యూటర్‌ సాంకేతిక లోపాల వల్ల కొందరికి పింఛన్ల మంజూరు ఆలస్యమవుతున్నాయన్నారు. వీలైనంత త్వరలో మిగిలిన లబ్ధిదారులకు పింఛన్లు అందేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-08T04:05:36+05:30 IST