యూత్ కాంగ్రెస్ నేతల అరెస్ట్
ABN , First Publish Date - 2022-12-31T23:53:35+05:30 IST
ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపుమేరకు ఛలో ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఆమనగల్లు/కడ్తాల్/తలకొండపల్లి, డిసెంబరు 31: ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామకాల్లో పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి పిలుపుమేరకు ఛలో ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయమే యువజన కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మండలాల నుంచి యూత్ కాంగ్రెస్ నేతలు ఎవరూ హైదరాబాద్ తరలకుండా నిఘా పెట్టారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై సీఐ జాల ఉపేందర్, ఎస్‌ఐలు సుందరయ్య, హరిశంకర్‌గౌడ్, వెంకటేశ్‌లు వాహనాల తనిఖీ నిర్వహించారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు హీరాసింగ్, రాజు, యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణనాయక్, రాఘవేందర్, సురేశ్ నాయక్, అలీం, రాజునాయక్, రమేశ్, శ్రీను, శ్రీకాంత్, మహేశ్, రాజు, రవీందర్ యాదవ్, అజీం, మోహన్ రెడ్డిలను సాయంత్రం సొంత పూచికత్తుపై విడుదల చేశారు. అదేవిధంగా చేవెళ్లలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్, చేవెళ్ల అసెంబ్లీ కార్యదర్శి సుశాంత్, అభిరవిలను అరెస్టు చేసి సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. అదేవిధంగా కేశంపేటలో ఎస్‌ఐ ధనుంజయ్ తన సిబ్బందితో కలిసి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భాస్కర్ గౌడ్, అనుమగళ్ల రమేష్, శ్రీనాథ్, రాజేందర్‌రెడ్డి, నాగిళ్ల భాస్కర్, ఆనంద్‌లను ముందస్తు అరెస్టు చేశారు. అనంతరం సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Read more