వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-12-30T23:59:53+05:30 IST

వచ్చే నెల 2న జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నట్టు మండల పరిధి వెంకటాపూర్‌లోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ ఉదారి వేణుగోపాల్‌ తెలిపారు.

వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఏర్పాట్లు
సమావేశంలో మాట్లాడుతున్న బాలాజీ వేంకటేశ్వరాలయ కమిటీ చైర్మన్‌ వేణుగోపాల్‌

ఘట్‌కేసర్‌ రూరల్‌, డిసెంబరు 30: వచ్చే నెల 2న జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తున్నట్టు మండల పరిధి వెంకటాపూర్‌లోని బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ ఉదారి వేణుగోపాల్‌ తెలిపారు. ఆలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్వయంభూగా వెలసిన బాలాజీ వేంకటేశ్వరస్వామి వారిని వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా దర్శించుకుంటే భాగ్యం కలుగుతుందన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా బారికెడ్లు, తాగునీటి సౌకర్యం, అర్చనలు, అభిషేకాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. లడ్డూ ప్రసాద వితరణకు ప్రత్యేక కౌంటర్లు తెరుస్తామన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కందుల నవీన్‌, నీరుడి శంకర్‌, నాగేష్‌, ఉపసర్పంచ్‌ సత్యనారాయణగౌడ్‌, మాజీ సర్పంచ్‌ బాలరాజ్‌గౌడ్‌, మాజీ ఎంపీటీసీ వెంకటే్‌షగౌడ్‌, నీరుడి శ్రీనివాస్‌, జంగయ్య, హరీశ్‌, కృష్ణ, దర్శన్‌ పాల్గొన్నారు.

============

Updated Date - 2022-12-30T23:59:53+05:30 IST

Read more