పొలం డబ్బుల విషయంలో గొడవ... అన్నను చంపిన తమ్ముడు

ABN , First Publish Date - 2022-11-18T23:23:54+05:30 IST

పొలం డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ హత్యకు దారితీసింది. అన్న గొంతుకు టవల్‌ బిగించి హత్య చేశాడు తమ్ముడు. ఈ సంఘటన తాండూరు మండలం గోనూరు గ్రామ శివారులోని మైసమ్మగుడి సమీపంలో శుక్రవారం జరిగింది.

పొలం డబ్బుల విషయంలో గొడవ... అన్నను చంపిన తమ్ముడు

గొంతుకు టవల్‌ బిగించి హత్య

గోనూరులో దారుణం

తాండూరు రూరల్‌, నవంబరు, 18 : పొలం డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ హత్యకు దారితీసింది. అన్న గొంతుకు టవల్‌ బిగించి హత్య చేశాడు తమ్ముడు. ఈ సంఘటన తాండూరు మండలం గోనూరు గ్రామ శివారులోని మైసమ్మగుడి సమీపంలో శుక్రవారం జరిగింది. గోనూరు గ్రామానికి చెందిన మాచనూరు ఆశప్ప, లాలమ్మకు ముగ్గురు కుమారులు నర్సప్ప, శ్రీనివాస్‌(40), శివకుమార్‌ ఉన్నారు. వీరికి 9 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో ఉమ్మడిగా ఒక ఎకరా పొలాన్ని రూ.40 లక్షలకు విక్రయించారు. ఇట్టి డబ్బుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో శ్రీనివాస్‌, శివకుమార్‌లో శుక్రవారం గొడవ పడ్డారు. దీంతో పత్తి చేలులోనే అన్న శ్రీనివా్‌సను తమ్ముడు శివకుమార్‌ టవల్‌ను గొంతుకు బిగించి హత్య చేశాడు. పక్క పొలంలోనే పత్తి తీసున్న మృతుడి భార్య బుజ్జమ్మ, మృతుడి బాబాయ్‌ దగ్గరికెళ్లి చూశారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్‌ గోవింద్‌, గ్రామస్తులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు రూరల్‌ సీఐ రాంబాబు, ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-11-18T23:23:54+05:30 IST

Read more