ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం
ABN , First Publish Date - 2022-12-07T23:29:53+05:30 IST
మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో నిర్మించిన సాయిబాబా దేవాలయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
నవాబుపేట, డిసెంబరు 7: మండల పరిధిలోని ఎల్లకొండ గ్రామంలో నిర్మించిన సాయిబాబా దేవాలయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ట్రస్టు చైర్మన్ రావుగారి వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు నాగిరెడ్డి, పార్వతి పరమేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ పట్లోళ్ల భరత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మల్లారెడ్డి, ఖదీర్, రత్నం, నర్సిములు, శాంతికుమార్, డైరెక్టర్ విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్పస్వామి ఆలయంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి పూజలు
తాండూరు : ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తాండూరులోని అయ్యప్పస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారికి పూజ, హారతి తదితర కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పట్టణంలోని గోశాలకు వెళ్లి అక్కడ గోవులకు ఎమ్మెల్యే స్వయంగా ఆహారం తినిపించారు. అయ్యప్ప మాలధారణ స్వాములు, నాయకులు ఉన్నారు.
దేవాలయాల అభివృద్ధికి సహకారం : డీసీసీబీ చైర్మన్
కులకచర్ల : దేవాలయాల అభివృద్ధికి సహకారం అందిస్తానని డీసీసీబీ చైర్మన్ మనోహర్‌రెడ్డి తెలిపారు. బుధవారం చౌడాపూర్ మండల పరిధిలోని కల్మన్‌కాల్వ తండాలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయం నిర్మాణానికి రూ.25వేల విరాళం అందజేశారు. దైవచింతనతో మానసిక ప్రశాంత లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందా్‌సనాయక్, సొసైటీ వైస్‌చైర్మన్ నాగరాజు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీ అంబీబాయి, స్థానికులు పాల్గొన్నారు.
కనులపండువగా గణపతి హోమం
ఘట్‌కేసర్ రూరల్ : మండల పరిధి ఎదులాబాద్‌లో గల శ్రీ సాయి నిలయంలో బుధవారం అయ్యప్ప మాలధారులు గణపతి హోమం, సుదర్శన, దత్త హోమాలు నిర్వహించారు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి జయంతి సందర్భంగా ఆలయ పూజారి కుమార్‌శర్మ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. ఉదయం ఆలయంలో సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ ఆవరణలో హోమాలను ఏర్పాటు చేశారు. అయ్యప్ప మాలధారులు లవంగు శ్రీధర్, నర్సింహా, కానుకుర్తి సురేష్, కొటారి సంతోష్, సాధ్విక్, సుధాకర్, సంజీవ, బొప్పని సన్ని తదితరులున్నారు.
సంజీవస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు
దోమ : మండల పరిధిలోని దొంగ ఎన్కెపల్లి గ్రామంలో గల సంజీవస్వామి దేవాలయాన్ని పరిగి మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి బుధవారం సందర్శించారు. ఈమేరకు ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దండు అశోక్, ప్రధాన కార్యదర్శి హన్మంతు, పరిగి మండలాధ్యక్షుడు పరుశరాంరెడ్డి, కులకచర్ల మండలాధ్యక్షుడు ఆంజనేయులు, సీనియర్ నాయకులు ఆంజనేయులు, మాధవరెడ్డి, పరిగి పట్టణ ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు ఎర్రగడ్డపల్లి జగన్, భాస్కర్, సోమలింగం తదితరులు పాల్గొన్నారు.
అయ్యప్ప పూజలో మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్
వికారాబాద్ : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్ పట్టణంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా పట్టణంలోని గరీబ్‌నగర్ కాలనీలో డైట్ లెక్చరర్ బబ్లు కూతురు శారీ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. అనంతరం కొత్తగడిలోని హనుమాన్ మందిరంలో రాజు స్వామి నిర్వహించిన అయ్యప్ప పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కొత్తగడిలో కాంగ్రెస్ కార్యకర్త వీరేశం సతీమణి అనారోగ్యంతో ఉన్నందున నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట మునిసిపల్ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్ వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఉస్మాన్, జావిద్ తదితరులు ఉన్నారు.