అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T05:14:06+05:30 IST

అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి

అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయాలి
మంత్రి మల్లారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న పోచారం మున్సిపాలిటీ కౌన్సిలర్‌ సాయిరెడ్డి తదితరులు

ఘట్‌కేసర్‌, అక్టోబరు 7 : పోచారం మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగుల కాలనీకి అంగన్‌వాడీ కేంద్రాన్ని మంజూరు చేయాలని 6వ వార్డు కౌన్సిలర్‌ సింగిరెడ్డి సాయిరెడ్డి శుక్రవారం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌ గృహకల్ప, దివ్యాంగుల కాలనీల్లో దాదాపు 15వేల జనాభా ఉన్నట్లు వివరించారు. ఇంతమంది జనాభాకు ఒక్కటే అంగన్‌వాడీ కేంద్రం ఉన్నందున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి తెలిపారు. కాగా, దివ్యాంగుల కాలనీలో భవనం సిద్ధంగా ఉన్నందున నూతనంగా మరో అంగన్‌వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. మల్లారెడ్డిని కలిసిన వారిలో కౌన్సిలర్‌ బాలగోని వెంకటే్‌షగౌడ్‌, కాలనీవాసులు ఉన్నారు.


Read more