ప్రజావాణికి వినతుల వెల్లువ

ABN , First Publish Date - 2022-10-18T04:29:08+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో

ప్రజావాణికి వినతుల వెల్లువ
ధర్మాసాగర్‌ను గ్రామ పంచాయతీ చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న గ్రామస్తులు

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 17 : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలు తమ సమస్యలను పరిష్క రించాలని గురించి అధికారులకు వినతులు సమర్పించారు. చేవెళ్ల మండలం ధర్మాసాగర్‌ను గ్రామపంచాయతీగా మార్చాలని గ్రామస్తులు జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావుకు వినతిపత్రం సమర్పించారు. మరో ఫిర్యాదులో దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల ప్రమేయాన్ని తొలగించాలని, ప్రభుత్వ అధికారుల చేత లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు పాపయ్య మాదిగ వినతి పత్రం సమర్పించారు. 20 ఏళ్లుగా నివాసం ఉంటున్న గుడిసెలను తొలగించడం అన్యాయమని సరూర్‌నగర్‌ మండలం నందనవనం కాలనీ వాసులు కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. 


ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి

ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో 200 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. 



Updated Date - 2022-10-18T04:29:08+05:30 IST