‘అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టును ఏర్పాటు చేయాలి’

ABN , First Publish Date - 2022-03-06T05:15:34+05:30 IST

‘అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టును ఏర్పాటు చేయాలి’

‘అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టును ఏర్పాటు చేయాలి’

పరిగి, మార్చి 5: పరిగి కోర్టులో కేసులు ఎక్కువగా ఉన్నందున అనదపు జూనియర్‌ సివిల్‌ కోర్టును ఏర్పాటుచేయాలని న్యాయవాదులు ఉమ్మడి జిల్లా జడ్జి తిరుపతిని కోరారు. శనివారం పరిగి మున్సిఫ్‌ కోర్టు ను డీజే సందర్శించారు. కోర్టులో కొనసాగుతున్న కేసులకు సంబంధించి న ఫైళ్ల గురించి తెలుసుకున్నారు. అనంతరం బార్‌ అసోషియేషన్‌ కా ర్యాలయంలో న్యాయవాదులతో సమావేశమయ్యారు. పరిగికోర్టులో అదనపు జూనియర్‌ సివిల్‌ కోర్టును ఏర్పాటు చేయాలని న్యాయవాదులు జ డ్జికి వినతిపత్రం ఇచ్చారు. పరిగి కోర్టులో మూడు నుంచి ఆరువేల వర కు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా కేసులను పరిష్కరించడం లేదని డీజే దృష్టికితీసుకెళ్లారు. దీనిపై జడ్జి సానుకూలంగా స్పందించారని న్యాయవాదులు తెలిపారు. న్యాయవాదుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాముయాదవ్‌, గౌస్‌పాషా, కృష్ణారెడ్డి, నరేందర్‌యాదవ్‌, లింగం, యాదయ్య, శ్రీనివా్‌సరెడ్డి, వెంకట్‌రెడ్డి, ఆనంద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-06T05:15:34+05:30 IST