అంబేడ్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల
ABN , First Publish Date - 2022-12-16T23:43:29+05:30 IST
చౌదర్‌పల్లిలో ఈ నెల 18న చేపట్టే బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణను పురస్కరించుకొని శుక్రవారం దోమలో ఆదర్శ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్ నాయకులు పోస్టర్ విడుదల చేశారు.
దోమ, డిసెంబరు 16: చౌదర్‌పల్లిలో ఈ నెల 18న చేపట్టే బీఆర్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణను పురస్కరించుకొని శుక్రవారం దోమలో ఆదర్శ యువజన సంఘం, ఎమ్మార్పీఎస్ నాయకులు పోస్టర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీ ఎస్ జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ పాల్గొంటారని.. మేధావులు, యువకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఎమ్మార్పీఎస్ నాయకులు డప్పు శేఖర్, రమేశ్‌కుమార్, కత్తులయ్య, రమేశ్, యాదగిరి, రాజు, రవీందర్, పోతుల రాజు, చౌదర్‌పల్లి ఆదర్శ యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు.