ఆమనగల్లు బంద్ విజయవంతం
ABN , First Publish Date - 2022-09-06T05:08:57+05:30 IST
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అక్రమ కేసులు
ఆమనగల్లు, సెప్టెంబరు 5: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అక్రమ కేసులు బనాయించి పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ సోమవారం వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఆమనగల్లు పట్టణ బంద్ నిర్వహించారు. రాజాసింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆమనగల్లు హిందూ దళ సభ్యులు ఆరోపించారు. ఆయనపై వెంటనే పీడీ యాక్ట్‌ను ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బంద్ విజయవంతం చేసిన ఆమనగల్లు పట్టణ ప్రజలకు ఎన్‌బీసీ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి కృతజ్ఞతలు తెలిపారు.