అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి
ABN , First Publish Date - 2022-12-07T23:26:40+05:30 IST
ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్ళు నిండినవారు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి కోటాజీ సూచించారు.
పరిగి, డిసెంబరు 7 : ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. 18 ఏళ్ళు నిండినవారు ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి కోటాజీ సూచించారు. బుధవారం పరిగిలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఓటరు నమోదు, ఆధార్ అనుసంధానం, తదితర ఆంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఎనిమిది వరకు 18 ఏళ్లు నిండినవారంతా తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఇప్పటికే గుర్తింపు కార్డు పొందినవారంతా ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.