మానవులంతా సమానమే
ABN , First Publish Date - 2022-06-20T05:06:22+05:30 IST
మానవులంతా సమానమే
- మజీద్ సందర్శనలో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి
తాండూరు, జూన్ 19 : మానవ మనుగడ, పురోగతి కోసం మానవులందరూ సమానమే అనే నినాదంతో తాండూరులో ‘మజీద్ ఈ మహ్మదీయ’ ఏర్పాటు చేసిన అన్ని మత విశ్వాసుల మజీద్ సందర్శన కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సమాజంలో ఐక్యత, శాంతి సామరస్యం అవసరమని, సోదర భావాన్ని పెంపొందించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కరణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్, జావెద్ తదితరులు పాల్గొన్నారు.