మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు 10 నుంచి దరఖాస్తులు
ABN , First Publish Date - 2022-03-06T04:28:30+05:30 IST
మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు 10 నుంచి దరఖాస్తులు
చేవెళ్ల, మార్చి 5: ప్రభుత్వ మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి విద్యార్థులు ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోవాలని చేవెళ్ల మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ టేనావతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం మోడల్ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, ఇతర అన్ని వసతులుం కల్పిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ నెల పదోతేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. సంబంధిత వెబ్‌సైట్‌లో సూచించిన వివరాల మేరకు దరఖాస్తులు పూర్తిచేసి ఆప్లోడ్ చేయాలని, మోడల్ స్కూల్లో అడ్మిషన్‌కు కచ్చితంగా ఎంట్రెన్స్ పరీక్ష రాయాలని ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.