పీఎంజీఎ్‌సవై పనుల్లో నాణ్యతా లోపాలుంటే చర్యలు

ABN , First Publish Date - 2022-08-26T05:11:47+05:30 IST

పీఎంజీఎ్‌సవై పనుల్లో నాణ్యతా లోపాలుంటే చర్యలు

పీఎంజీఎ్‌సవై పనుల్లో నాణ్యతా లోపాలుంటే చర్యలు

  • పీఎంజీఎ్‌సవై పనుల్లో నాణ్యతా లోపాలుంటే చర్యలు
  • రోడ్డు పనులను పరిశీలించిన రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్‌ మానిటరింగ్‌ బృందం
  • రూ.2.18కోట్లతో చేట్టిన పనుల పరిశీలన
  • పర్యవేక్షించిన రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్‌ మానిటరింగ్‌ అధికారి సుధాకర్‌రావు

తాండూరు రూరల్‌, ఆగస్టు 25: పీఎంజీఎ్‌సవై(ప్రధాన మంత్రి గ్రామీణ్‌ సడక్‌ యోజన) పనులు నాణ్యతగా లేకుంటే కాంట్రాక్టర్‌పై చర్యలు తప్పవని రాష్ట్ర క్వాలిటీ కంట్రోల్‌ మానిటరింగ్‌ అధికారి సుధాకర్‌రావు హెచ్చరించారు. గురువారం తాండూరు మండలం చెంగోల్‌ గ్రామం నుంచి పర్వతాపూర్‌ వరకు ఐదు కిలో మీటర్ల మేరకు రూ.2కోట్ల 18లక్షలతో నిర్మించే రోడ్డు పనులను ఆయన అధికారులతో బృందంతో వచ్చి తనిఖీ చేపట్టారు. చెంగోల్‌ గ్రామ శివారులోని చెరువు వద్ద రోడ్డు నాణ్యత ను పరిశీలించేందుకు తవ్వి లోపల ఉన్న కంకరను పరిశీలించారు. పీఎంజీఎ్‌సవై కింద 5కిలో మీటర్ల దూరానికి ప్రభుత్వం రూ.2కోట్ల 18లక్షల నిధులను మంజూరు చేసిందని, అందులో భాగంగా పనులు ఎలా కొనసాగుతున్నాయి? ఏ మేరకు పూర్తయ్యాయి? నాణ్యతగా ఉన్నాయా.. లేదా? నాసిరకంగా నిర్మించారా? అనే దానిపై పరిశీలించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటి వరకు రోడ్డుపై గ్రావెల్‌పై కంకర వేశామని, ఆ పనులు పూర్తయ్యాక నాణ ్యత ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిన తర్వాతనే బీటీ పనులు కొనసాగుతాయని చెప్పారు. పరిశీలించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన చెప్పారు. పనుల్లో నాణ్యత లోపిస్తే కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుంటామన్నారు. వికారాబాద్‌ జిల్లా పంచాయతీ రాజ్‌ ఈఈ, తాండూరు పంచాయతీరాజ్‌ డీఈలు ఎప్పటికప్పుడు రోడ్డు పనులను పరిశీలిస్తూ నాణ్యతగా వేసేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఆయన వెంట డీఈ వెంకట్‌రావు, ఏఈ సిద్ధార్థ తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-08-26T05:11:47+05:30 IST