గ్రామకంఠం కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
ABN , First Publish Date - 2022-10-08T05:16:45+05:30 IST
గ్రామకంఠం కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
దోమ, అక్టోబరు 7: బ్రహ్మణ్పల్లిలోని గ్రామకంఠం భూమిని కొంతమంది నాయకులు కబ్జా చేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ షాహేదాబేగంకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు గ్రామకంఠం భూమిని కబ్జా చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు.