-
-
Home » Telangana » Rangareddy » A young man was injured in a road accident
-
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
ABN , First Publish Date - 2022-11-02T00:01:52+05:30 IST
అతివేగం అజాగ్రత్తతో బైక్ నడుపుతూ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి.

మొయునాబాద్, నవంబరు 1: అతివేగం అజాగ్రత్తతో బైక్ నడుపుతూ డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఓ యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మొయినాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళవారం గ్రామానికి చెందిన సుమాన్‌గౌడ్ సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి తన ఇంటికి స్కూటీపై వస్తున్నాడు. వేగంగా నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టి బొల్తాపడ్డాడు. తీవ్రగాయాలపాలైన సుమాన్‌గౌడ్‌ను నగరంలోని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.