ఆలయాల అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ABN , First Publish Date - 2022-12-15T00:16:53+05:30 IST
తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమే్‌షకుమార్ అన్నారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమే్‌షకుమార్
తాండూరు ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ
తాండూరు, డిసెంబరు 14 : తాండూరు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి యు.రమే్‌షకుమార్ అన్నారు. ఈమేరకు ఆయన బుధవారం ఎమ్మెల్యేకు బహిరంగ లేఖ రాశారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేకు చాలా దగ్గరని చెప్పుకుంటారే కానీ, తాండూరు ప్రాంత ఆలయాల గురించి తెలియదా? అంటూ లేఖలో ప్రశ్నించారు. వేములవాడ రాజన్న ఆలయానికి రూ.400కోట్ల అంచనాతో మాస్టర్ ప్లాన్‌కు సీఎం అంగీకారం, కొండగుట్టకు రూ.100కోట్ల నిధులు ఇస్తానని ప్రకటన విషయాలను తాము స్వాగతిస్తున్నామన్నారు. సీఎం అనంతపద్మనాభస్వామి ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని, తెలంగాణ వస్తే అనంతగిరిని కాశ్మీర్‌లా చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాటలు వాస్తవం కాదా? అంటూ ప్రస్తావించారు. 8ఏళ్లలో అనంతగిరి పర్యాటక అభివృద్ధికి సీఎం ఏం చేశారో చెప్పాలని, తాండూరులోని భద్రేశ్వరస్వామి ఆలయం, జుంటుపల్లి రామాలయం, బషీరాబాద్ ఏకాంబర రామలింగేశ్వరాలయం, పెద్దేముల్ అంబురామేశ్వర దేవాలయాల పరిస్థితి ఏమిటని అన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఇకనైనా తాండూరులో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, హిందువుల మనోభావాలను కాపాడాలంటూ యు.రమే్‌షకుమార్ పేర్కొన్నారు.