బైకును ఢీకొన్న టిప్పర్‌.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-08-21T05:30:00+05:30 IST

బైకును ఢీకొన్న టిప్పర్‌.. వ్యక్తి మృతి

బైకును ఢీకొన్న టిప్పర్‌.. వ్యక్తి మృతి

శామీర్‌పేట, ఆగస్టు 21 : బైక్‌ను టిప్పర్‌ ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన షేక్‌ చాంద్‌బీ, అజీజ్‌ దంపతులు 20సంవత్సరాల క్రితం మేడ్చల్‌ జిల్లా అలియాబాద్‌ గ్రామానికి వలస వచ్చి బతుకుదెరువు కోసం గ్రామంలోని బానురి ఏంచరెడ్డికి చెందిన 15ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలల నుంచి మృతుడు షేక్‌ అజీజ్‌(45) బీబీనగర్‌లోని ఓ షాపులో వెల్డింగ్‌ పని చేస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం ఉదయం అతడు బైక్‌పై వెళ్తుండగా బొమ్మరాసిపేట గ్రామ సమీపంలోని టీఎంఆర్‌ వెంచర్‌ ఎదుట ఓ టిప్పర్‌ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో అజీజ్‌ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more