అ‘పూర్వ’ సమ్మేళనం
ABN , First Publish Date - 2022-10-08T04:06:19+05:30 IST
అ‘పూర్వ’ సమ్మేళనం
తలకొండపల్లి, అక్టోబరు 7: మండలంలోని చుక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో1999-2000 సంవత్సరం ఎస్‌ఎ్‌ససీ బ్యాచ్ పూర్వవిద్యార్థుల శుక్రవారం ఒకే చోటుకు చేరారు. వారు చదువుకున్న పాఠశాలే ఇందుకు వేదికైంది. తమకు విద్యాబుద్దులు నేర్పించి ఉన్నతికి కారణమైన ఉపాధ్యాయులు సాయిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, యాదయ్య, శేతుపతిలను ఘనంగా సన్మానించారు. పాఠశాలలో సౌకర్యాల కల్పనతో పాటు సేవా కార్యక్రమాల్లో తమవంతు పాలు పంచుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వవిద్యార్థుల సంఘం నాయకులు శ్రావణ్, భాస్కర్, మల్లేశ్, ఆంజనేయులు, శ్రీధర్‌రెడ్డి, అనిల్, పర్వతాలు, శ్రీవాణి, స్వప్న, సంధ్య, సరిత, కల్పన, శ్రీను తదితరులు పాల్గొన్నారు.