అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-10-07T06:11:18+05:30 IST

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కొత్తూర్‌, ఆక్టోబర్‌ 6: కొత్తూర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని తిమ్మాపూర్‌ చౌరస్తా సమీపంలో 44వ నెంబర్‌ జాతీయ రహదారి ప్రక్కన అనుమానాస్పద స్థితిలో కత్రవత్‌రెడ్యా(42) అనే వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. జడ్చర్ల మండలం పెద్దతండాకు చెందిన రెడ్యా హైదరాబాద్‌లోని ఉప్పుగూడలో నివాసముంటూ మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.  బుధవారం సాయంత్రం రెడ్యా తన బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. గురువారం తెల్లవారుజామున ఎన్‌హెచ్‌ఏఐ జీఎంఆర్‌ సిబ్బంది పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా రోడ్డుపక్కన రెడ్యా మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతదేహాంపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు శవపరీక్ష కోసం షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. జీఎంఆర్‌  పెట్రోలింగ్‌ సూపర్‌వైజర్‌ వినయ్‌కుమార్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శంకర్‌ తెలిపారు. ఘటనాస్థలాన్ని షాద్‌నగర్‌ ఏసీపీ కుషాల్కర్‌, కొత్తూర్‌ సీఐ బాల్‌రాజ్‌లు పరిశీలించారు. 

Updated Date - 2022-10-07T06:11:18+05:30 IST