వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-11-23T23:33:07+05:30 IST

రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘట్‌కేసర్‌ సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, నవంబరు 23 : రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఘట్‌కేసర్‌ సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... జోగులాంబ-గద్వాల్‌ జిల్లా రాజోలు మండలం మందొడ్డి గ్రామానికి చెందిన గంటెపోగు మద్దిలేటి(45) ఘట్‌కేసర్‌కు 15 రోజులు కూలీ పనులు చేయడానికి వచ్చాడు. మంగళవారం రాత్రి తన స్నేహితుడు అబ్రహంతో కలిసి వరంగల్‌-హైద్రాబాద్‌ జాతీయ రహాదారి ఘట్‌కేసర్‌ బైపా్‌సలో వందన హోటల్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ఉప్పల్‌ నుంచి యాదగిరిగుట్ట వైపు వెళుతున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో మద్దిలేటి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు.

Updated Date - 2022-11-23T23:33:07+05:30 IST

Read more