నూతన ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-03-05T04:29:36+05:30 IST

నూతన ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయాలి

నూతన ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయాలి
కొత్తూర్‌ నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న అటవీ శాఖ రాష్ట్ర అధికారులు

బొంరా్‌సపేట్‌, మార్చి 4: కొత్తూర్‌ అటవీప్రాంతంలో నూతన ప్లాంటేషన్‌ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు అటవీశాఖ రాష్ట్ర అధికారి సునీతాభగవత్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక అటవీశాఖ అధికారులతో కలిసి కొత్తూర్‌ ఫారెస్టు నర్సరీని పరిశీలించారు. అనంతరం రేగడిమైలారం సమీపంలోని 163వ హైవేకు ఇరువైపులా ఉన్న అటవీప్రాంతంలోని నీలగిరి చెట్లను తొలగించి వాటి స్థానంలో నూతన ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆప్రాంతంలోని భూమి చదునును పరిశీలించారు. ప్లాంటేషన్‌ ఏర్పాటు కోసం భూమి అనువుగా ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్బంగా అటవీ శాఖ ఫ్లయింగ్‌ స్క్యాడ్‌ అధికారి మక్సూద్‌, వికారాబాద్‌ జిల్లా అటవీశాఖ అధికారి వేణుమాధవరావు, కొడంగల్‌ ఫారెస్టు రేంజ్‌ అధికారిణి సబిత తదితరులు పాల్గొన్నారు.

Read more