ఆమనగల్లులో జాతీయ శాంపిల్‌ సర్వే షురూ

ABN , First Publish Date - 2022-10-19T05:17:56+05:30 IST

జాతీయ గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌

ఆమనగల్లులో జాతీయ శాంపిల్‌ సర్వే షురూ
ఆమనగల్లులో సర్వే చేస్తున్న సభ్యులు

ఆమనగల్లు, అక్టోబరు 18: జాతీయ గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ శాంపిల్‌ సర్వేలో భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీలో మంగళవారం జాతీయ నమునా సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కందుకూరు ఆర్టీవో కార్యాలయ ఉప గణాంక అధికారి ఎన్‌. శ్రీనివా్‌సరెడ్డి, ఆమనగల్లు, కందుకూరు, కడ్తాల మండలాల ప్రణాళిక, గణాంక అధికారులు బి. శివప్రసాద్‌, కె. హరీశ్‌కుమార్‌, బీ.ఎ్‌స.ప్రమోద్‌, డీఈఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ సౌమ్య, సీపీవో జాయింట్‌ డైరెక్టర్‌ ఓంప్రకాశ్‌, ఉప గణాంక అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, డీఈఎస్‌ ఉప గణాంక అధికారులు పి. పద్మావతి, దీప్తిలతో కూడిన బృందం శివాలయనగర్‌ కాలనీలో సర్వే నిర్వహించారు. ఎంపిక చేసిన 32 కుటుంబాలకు సంబంధించి జీవన స్థితిగతులు, ఆర్థిక అవసరాలు, వైద్య విధానం, ఆదాయం, వ్యయం తదితర విషయాల గురించి సమగ్ర వివరాలు సేకరించారు. 20 కుటుంబాల నుంచి సీఐఎంఎస్‌, 12 కుటుంబాల నుంచి ఆయూ్‌షకు సంబంధించిన సమాచారం సేకరించారు. 2023 జూన్‌ వరకు యాధృచ్చిక పద్ధతిలో సర్వే కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. సర్వే నివేదికనకు ఉన్నతాధికారులకు అందిస్తామని బృందం సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఎ్‌సవో వాణి, కౌన్సిలర్‌ చెక్కాల లక్ష్మణ్‌ పాల్గొన్నారు. Read more