చేపట వేటకు వెళ్లి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-12-07T23:32:47+05:30 IST

చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి.. వల చుట్టుకోవడంతో మృతిచెందిన ఘటన మండల పరిధిలోని ఘనాపూర్‌లో చోటుచేసుకుంది.

చేపట వేటకు వెళ్లి వ్యక్తి మృతి

కులకచర్ల, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన ఓ వ్యక్తి.. వల చుట్టుకోవడంతో మృతిచెందిన ఘటన మండల పరిధిలోని ఘనాపూర్‌లో చోటుచేసుకుంది. ఘనాపూర్‌ గ్రామానికి చెందిన దండు రాములు(50) మంగళవారం రాత్రి చెరువులో చేపలు పట్టేందుకు వల వేసి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చెరువు దగ్గరికి వెళ్లి చూడగా చెరువులో శవమై కనిపించాడు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీయగా కాళ్లకు చేపలు పట్టే వల చుట్టుకొని ఉంది. కాగా, చెరువులో చేపలకు వల వేస్తుండగా ప్రమాదవశాత్తు వల కాళ్లకు చుట్టుకొని మృతిచెంది ఉంటాడని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. మృతుడి భార్య అంజిలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరి తెలిపారు. మృతుడికి ముగ్గు కుమార్తెలుండగా.. వారందరికీ వివాహాలు జరిగాయి. విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు ఆంజనేయులు ద్వారా మృతుడి కుటుంబానికి రూ.5 వేల ఆర్థికసాయం అందించారు.

Updated Date - 2022-12-07T23:32:48+05:30 IST