బైక్ ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
బంట్వారం అక్టోబరు 17: బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన తోర్మామిడిలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకా రం.. గ్రామానికి చెందిన బుర్ర దినాకర్(35) ఆదివారం పశువులను మేపేందుకు ఆడవిలోకి తోలుకెళ్లి సాయంత్రం తిరిగి వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన బైక్(ఏపీ23 ఎఫ్8200) అతడిని ఢీకొనగా గాయపడ్డాడు. వెంటనే కుంచారం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం డాక్టర్లు జహీరాబాద్‌కు రెఫర్ చేశారు. దినాకర్ జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతడి తల్లి పుష్పమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అనంద్ తెలిపారు. దినాకర్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.