ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన

ABN , First Publish Date - 2022-11-06T23:52:05+05:30 IST

గట్టిప్పలపల్లి లోని హనుమాన్‌ ఆలయం వద్ద ఆదివారం జడ కొప్పు కోలాటం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జడ కొప్పు కోలాట ప్రదర్శన
ప్రదర్శనలో శ్రీనివా్‌సరెడ్డి, నాయకులు

తలకొండపల్లి, నవంబరు 6: గట్టిప్పలపల్లి లోని హనుమాన్‌ ఆలయం వద్ద ఆదివారం జడ కొప్పు కోలాటం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఏటా కార్తీక మాసంలో గ్రామంలో జడ కొప్పు కోలాటం నిర్వహిస్తారు. అంతరించి పోతున్న గ్రామీణ కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలకొండపల్లి వైస్‌ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్‌, రేణురెడ్డి, గుండ్రాతి జంగయ్య, కోల రమేశ్‌, పవన్‌ వాల్మీకి, రామచంద్రి, వనం శివయ్య, జంగయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-11-06T23:52:06+05:30 IST