బెదిరించి డబ్బులు డిమాండ్‌.. వ్యక్తిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-09-20T05:23:51+05:30 IST

బెదిరించి డబ్బులు డిమాండ్‌.. వ్యక్తిపై కేసు నమోదు

బెదిరించి డబ్బులు డిమాండ్‌.. వ్యక్తిపై కేసు నమోదు

శంషాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 19: లారీ డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన సోమవారం శంషాబాద్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.  సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం గోదావరిఖనికి చెందిన అశోక్‌ అనే లారీ డ్రైవర్‌ ఆదివారం జడ్చర్ల నుంచి లారీ తీసుకుని తుక్కుగూడ వైపు వెళ్తున్నాడు. మార్గమధ్యలో నిద్ర రావడంతో మండలంలోని సంఘీగూడ వద్ద లారీని నిలిపి నిద్రపోతున్నారు. అంతలో ఓ వ్యక్తి కారులో పోలీస్‌ సైరన్‌తో వచ్చి లారీ డ్రైవర్‌ను లేపాడు. రోడ్డుపై లారీని ఎందుకు ఆపావని డబ్బులు డిమాండ్‌ చేశాడు. లారీ డ్రైవర్‌ అరిచి చుట్టుపక్కల వారిని పిలిచాడు. అక్కడున్న పాశం ధన్‌రాజ్‌, రాయకుంట భాను, సందీ్‌పరెడ్డి వచ్చి బెదిరింపునకు పాల్పడిన వ్యక్తిని  గుర్తుపట్టారు. అతడు మదన్‌పల్లికి చెందిన కృష్ణమోని శ్యామ్‌గా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Read more