ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2022-12-15T23:48:36+05:30 IST

ట్రాలీ ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన ఆగాపల్లి సాగర్‌రహదారిపై గురువారం చోటుచేసుకుంది.

ట్రాలీ ఆటోను ఢీకొన్న కారు.. ఒకరి మృతి

మంచాల, డిసెంబరు 15: ట్రాలీ ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఈ ఘటన ఆగాపల్లి సాగర్‌రహదారిపై గురువారం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన కారుశెట్టి వెంకటయ్య(38) పెయింట్‌ డబ్బాల కొనుగోలు కోసం ఇబ్రహీంపట్నం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆటోట్రాలీలో వస్తున్నాడు. ఆగాపల్లి సాగర్‌రహదారిపై క్రషర్‌మిషన్‌వద్ద వెనుకనుంచి వస్తున్న కారు.. ట్రాలీ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారుశెట్టి వెంకటయ్య తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేష్‌ తెలిపారు.

Updated Date - 2022-12-15T23:48:37+05:30 IST