పోడు భూముల క్రమబద్ధీకరణకు 9వేల దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-10-18T04:33:34+05:30 IST

పోడు భూముల క్రమబద్ధీకరణకు 9వేల దరఖాస్తులు

పోడు భూముల  క్రమబద్ధీకరణకు 9వేల దరఖాస్తులు
మాట్లాడుతున్న వెంకటేశ్వర్‌రెడ్డి

తాండూరు, అక్టోబరు17: వికారాబాద్‌జిల్లాలో పోడు భూముల  క్రమబద్ధీకరణకు 9వేల దరఖాస్తులు వచ్చాయని జిల్లా అటవీ రేంజ్‌ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. సోమవారం తాండూరు అటవీ రేంజ్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 42 వేల హెక్టార్ల అటవీ భూమి ఉందని తెలిపారు. 2005 కంటే ముందు సాగు చేసుకుంటున్న గిరిజనులకు పోడు భూములు కేటాయించే అవకాశం ఉందని తెలిపారు. పోడు భూములకు సంబంధించి ఫీల్డ్‌ విజిట్‌ చేయడంతోపాటు గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పరిశీలిస్తున్నామని అన్నారు. యాలాల మండలం రాస్నం, కొడంగల్‌ మండలం అప్పాయిపల్లిలో పోడు భూముల కోసం కొందరు అటవీ భూముల్లో చెట్లను నరికి కబ్జాలో ఉంటున్నారని అన్నారు. ఈ విషయమై 2005 కంటే ముందు కబ్జాలో ఉన్న వారికే పోడు భూములు చెందుతాయని అన్నారు. పోడు భూములకు కేటాయింపులకు సంబఽంధించి ఇంకా గైడ్‌లైన్స్‌ రాలేదని పేర్కొన్నారు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పదెకరాల వరకు భూమి కేటాయించే అవకాశాలున్నాయన్నారు. జిల్లాలో  20 వేల ఎకరాల పోడు భూముల్లో  రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. ఏ చెట్లను నరకాలన్నా తప్పనిసరి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందాలన్నారు. ఆయన వెంట తాండూరు అటవీరేంజ్‌ అధికారి శ్యాంసుందర్‌రావు  ఉన్నారు.

Updated Date - 2022-10-18T04:33:34+05:30 IST