ఈ నెల 17న పెన్షనర్స్‌ డే

ABN , First Publish Date - 2022-12-16T23:40:31+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) వికారాబాద్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17న పెన్షనర్స్‌ డే నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు మాణిక్‌ప్రభు, కార్యదర్శి డి.శ్రీహరి శుక్రవారం తెలిపారు.

ఈ నెల 17న పెన్షనర్స్‌ డే

వికారాబాద్‌, డిసెంబరు 16: తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగుల సంఘం (టీఎస్‌జీఆర్‌ఈఏ) వికారాబాద్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17న పెన్షనర్స్‌ డే నిర్వహిస్తున్నామని సంఘం అధ్యక్షుడు మాణిక్‌ప్రభు, కార్యదర్శి డి.శ్రీహరి శుక్రవారం తెలిపారు. ఉదయం 10గంటలకు వికారాబాద్‌లోని శ్రీ సత్యసాయి విజ్ఞాన కేంద్రంలో సమావేశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో 73సంవత్సరాలు నిండిన పెన్షనర్లను సన్మానిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆనంద్‌, మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ మంజుల ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు.

Updated Date - 2022-12-16T23:40:32+05:30 IST