కళా ఉత్సవం పోటీల్లో ప్రథమ బహుమతి

ABN , First Publish Date - 2022-12-07T23:51:23+05:30 IST

రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో పాల్మాకుల మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని కృష్ణదేవి బొమ్మల తయారీ, ఆటలు విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైందని ప్రిన్సిపాల్‌ విష్ణుప్రియ బుధవారం తెలిపారు.

కళా ఉత్సవం పోటీల్లో ప్రథమ బహుమతి

శంషాబాద్‌, డిసెంబరు 7: రాష్ట్రస్థాయి కళా ఉత్సవ్‌ పోటీల్లో పాల్మాకుల మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని కృష్ణదేవి బొమ్మల తయారీ, ఆటలు విభాగంలో ప్రథమస్థానంలో నిలిచి జాతీయ స్థాయికి ఎంపికైందని ప్రిన్సిపాల్‌ విష్ణుప్రియ బుధవారం తెలిపారు. కృష్ణదేవికి ఎంఈసీ సెకండియర్‌ విద్యార్థిని అన్నారు. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు భువనేశ్వర్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటుందని తెలిపారు. అలాగే రాష్ట్రస్థాయి పోటీల దృశ్య కళల విభాగంలో టెన్త్‌ విద్యార్థి ఎ.నితిన్‌ 4వ స్థానంలో నిలిచాడని చెప్పారు.

జాతీయ స్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థిని

చౌదరిగూడ: లాల్‌పహాడ్‌ కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని మాధవి బుధ వారం హైదరాబాద్‌ కళా ఉత్సవ్‌లో జరిగిన రాష్ట్ర స్థా యి వోకల్‌ మ్యూజిక్‌ ఫోక్‌లో ప్రథమస్థానంలో నిలిచి జాతీయస్థాయికి ఎంపికైందని ఎస్వో రాగసుధ తెలిపారు.

Updated Date - 2022-12-07T23:51:24+05:30 IST