తాండూరు వ్యవసాయ డివిజన్‌కు 138 క్వింటాళ్ల విత్తనాలు మంజూరు

ABN , First Publish Date - 2022-06-12T05:30:00+05:30 IST

తాండూరు వ్యవసాయ డివిజన్‌కు 138 క్వింటాళ్ల విత్తనాలు మంజూరు

తాండూరు వ్యవసాయ డివిజన్‌కు 138 క్వింటాళ్ల విత్తనాలు మంజూరు

  • వ్యవసాయశాఖ తాండూరు ఏడీఏ రుద్రమూర్తి

తాండూరు రూరల్‌, జూన్‌ 12 : ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు తమ పంటపొలాల్లో విత్తనాలు వేసుకునేందుకు ప్రభుత్వం 138.6 క్వింటాళ్ల విత్తనాలను మంజూరు చేసిందని వ్యవసాయశాఖ తాండూరు ఏడీఏ రుద్రమూర్తి ఆదివారం పేర్కొన్నారు. కంది విత్తనాలు.. తాండూరు మండలానికి పీఆర్‌జీ 176 రకం కంది విత్తనాలు 5.4క్వింటాళ్లు, ఎల్‌ఆర్‌జీఎస్‌ 52 రకం 30 క్వింటాళ్లు, మినుములు వీబీఎన్‌ 8 రకం 25 క్వింటాళ్లు, పెద్దేముల్‌ మండలానికి పీఆర్‌జీ 176 రకం 5.4 క్వింటాళ్లు, ఎల్‌ఆర్‌జీ 52 రకం 20.4క్వింటాళ్లు, ఎల్‌బీజీ 787 రకం 17 క్వింటాళ్లు, యాలాల మండలానికి కందులు 5.4 క్వింటాళ్లు, ఎల్‌ఆర్‌జీ 52 రకం 15క్వింటాళ్లు, మినుములు 10 క్వింటాళ్లు, బషీరాబాద్‌ మండలానికి మినుములు 5క్వింటాళ్ల చొప్పున మంజూరయ్యాయని చెప్పారు. వీటిని వ్యవసాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో చిన్న, సన్నకారు రైతులు ఉచితంగా పొందవచ్చని ఆయన చెప్పారు. బషీరాబాద్‌ మండలానికి కందులు, పెసర విత్తనాలు రావాల్సి ఉందని, అవి రాగానే వాటిని కూడా ఉచితంగానే పంపిణీ చేస్తామని అన్నారు. రైతులకు ఇబ్బందిగా ఉంటే తాండూ రులోని వ్యవసాయశాఖ కార్యాలయంలో తనను సంప్రదించవన్నారు.

Updated Date - 2022-06-12T05:30:00+05:30 IST