బాన్సువాడను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం

ABN , First Publish Date - 2022-03-05T05:59:45+05:30 IST

బాన్సువాడను మెడికల్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం ప్రభుత్వ ఏరియాస్పత్రి, మాతా శిశు ఆస్పత్రి మధ్యన పట్టణ ప్రధాన రహదారిపై రూ.3కోట్లతో నిర్మించనున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

బాన్సువాడను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం
ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న స్పీకర్‌ పోచారం

బాన్సువాడ, మార్చి 4: బాన్సువాడను మెడికల్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం ప్రభుత్వ ఏరియాస్పత్రి, మాతా శిశు ఆస్పత్రి మధ్యన పట్టణ ప్రధాన రహదారిపై రూ.3కోట్లతో నిర్మించనున్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లా డుతూ బాన్సువాడ పట్టణానికి మెడికల్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దు తామన్నారు. మహిళలు, శిశువుల వైద్య సేవల కోసం ప్రత్యేకంగా ఇరవై కోట్ల రూపాయలతో మాత, శిశు ఆస్పత్రిని నిర్మించి అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు. బాన్సువాడ ఏరియాస్పత్రిలో ఐసీయూ యూని ట్‌, బ్లడ్‌ బ్యాంకు, డయాలసిస్‌ సెంటర్‌లను ఏర్పాటు చేయించామన్నారు. బాన్సువాడతో పాటు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు నిజామాబాద్‌, కామారెడ్డి, హైదరాబాద్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బాన్సువాడ పట్టణంలోనే ఆధునిక వైద్య సేవలను నెలకొల్పా మన్నారు. బాన్సువాడ ఏరి యాస్పత్రి, మాత శిశు హాస్పిటల్‌ మధ్య న బాన్సువాడ ప్రధాన రహదారి ఉండంటతో వైద్యులు, రోగులు, సహాయకులు సుల భంగా రాకపోకలు సాగించడానికి రూ.3 కోట్లతో కాలినడకన వంతెన (ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి)ను ప్రత్యేకంగా నిర్మిస్తున్నామన్నారు. పూర్తిగా స్టీల్‌తో కూడిన ఆధునిక సాంకేతిక పద్ధతులతో నిర్మించే ఈ ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి 153 మీటర్ల పొడవు, 8 ఫీట్ల వెడల్పు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, ఆత్మ కమిటీ చైర్మన్‌ మోహన్‌ నాయక్‌, ప్రభుత్వ ఏరియాస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌, నాయకులు ఎజాజ్‌, వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:59:45+05:30 IST