కేసీఆర్‌ ఫాంహౌజ్‌ను ముట్టడిస్తాం

ABN , First Publish Date - 2022-08-04T05:30:00+05:30 IST

ప్రజలకు మాయమాటలు చెప్పి సీఎం కుర్చీని ఎక్కి ఫాంహౌజ్‌కు పరిమితమవుతున్న కేసీఆర్‌ ఫాంహౌజ్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం మండలంలోని భవానీపేట్‌, భవానీపేట్‌ తండా, ఆరేపల్లి, పోతారం, ఇసాయిపేట్‌, మంఽథన్‌ దేవునిపల్లి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు.

కేసీఆర్‌ ఫాంహౌజ్‌ను ముట్టడిస్తాం
రచ్చబండలో ప్రజలతో మాట్లాడుతున్న షబ్బీర్‌అలీ

- కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ 

మాచారెడ్డి, ఆగస్టు 4: ప్రజలకు మాయమాటలు చెప్పి సీఎం కుర్చీని ఎక్కి ఫాంహౌజ్‌కు పరిమితమవుతున్న కేసీఆర్‌ ఫాంహౌజ్‌ను ముట్టడిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత షబ్బీర్‌అలీ అన్నారు. గురువారం మండలంలోని భవానీపేట్‌, భవానీపేట్‌ తండా, ఆరేపల్లి, పోతారం, ఇసాయిపేట్‌, మంఽథన్‌ దేవునిపల్లి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి రెండుసార్లు అధికారం కట్టబెడితే కేంద్రంపై నెపం మోపి ఢిల్లీ వెళ్లి పోరాడతానని ఊకదంపుడు మాటలు చెప్పేందుకు కేసీఆర్‌ పరిమితం అవుతున్నారని అన్నారు. మోదీ, కేసీఆర్‌ ఇద్దరు తోడు దొంగలని విమర్శించారు. వీరి హయాంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. మోదీ గొప్పగా చెప్పుకునే నోట్ల రద్దు పేదల పాలిట విష ప్రయోగమని మండిపడ్డారు. దేశ సంపదను అదానీ, అంబానీలకు మోదీ అమ్ముతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ సైతం హైదరాబాద్‌ చుట్టు పక్కల ఉన్న విలువైన భూములను తన బంధువులకు కట్టబెడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఎకరాకు రూ.15 వేల సాయం, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలను కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచారెడ్డి మండల అధ్యక్షుడు నునావత్‌ గణేష్‌ నాయక్‌, పొన్నాల లక్ష్మారెడ్డి, మాచారెడ్డి మండల యూత్‌ అధ్యక్షుడు నర్సారెడ్డి, బ్రహ్మానందరెడ్డి, లింగం, అస్లాం, శంకర్‌ నాయక్‌, రవిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST