చెడుపై మంచి విజయం సాధించినప్పుడే విజయదశమి

ABN , First Publish Date - 2022-10-07T06:13:26+05:30 IST

చెడుపై మంచి విజయం సాధించినప్పుడే విజయదశమి పండుగను ప్రజలు జరుపుకుంటారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం విజయ దశమి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీక్షించారు.

చెడుపై మంచి విజయం సాధించినప్పుడే విజయదశమి
బాన్సువాడ మినీ స్టేడియంలో రావణదహన కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్‌

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడ, అక్టోబరు 6: చెడుపై మంచి విజయం సాధించినప్పుడే విజయదశమి పండుగను ప్రజలు జరుపుకుంటారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం విజయ దశమి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వీక్షించారు. డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం భారీ ఎత్తున రావణ దహనాన్ని నిర్వహించారు. ప్రజలందరూ చెడును వీడి మంచి మార్గంలో నడవాలని, అప్పుడే విజయం సాధిస్తామని ఆయన తెలిపారు. రావణ దహన కార్యక్రమాన్ని ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకోవాలి
బాన్సువాడ పట్టణంలోని జయశంకర్‌  మినీ స్టేడియంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను దసరా పండుగ రోజు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో రెండు బస్తీ దవాఖానాలు మంజూరయ్యాయన్నారు. దీపావళి పండుగ రోజున మరో బస్తీ దవాఖానాను ప్రారంభిస్తామన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. నూతన డయాలసిస్‌ సెంటర్‌తో పాటు బ్లడ్‌ బ్యాంకు, ఐసీయూ, ఎన్‌ఐసీయూ అంబులెన్స్‌ సౌకర్యాలు కూడా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేయించామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌, ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌ తదితరులు ఉన్నారు.

హెలికాప్టర్‌లో బయలుదేరిన స్పీకర్‌
టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దసరా పండుగ సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీని బీఆర్‌ఎస్‌ పార్టీగా మారుస్తూ ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి బుధవారం స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక హెలికాఫ్టర్‌ను పంపించారు. బాన్సువాడలో ఉదయం 10 గంటలకు విచ్చేసిన హెలికాప్టర్‌ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని, డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్‌రెడ్డిలు కలిసి సమావేశానికి బయలుదేరారు. కార్యక్రమం అనంతరం తిరిగి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తన ఇద్దరు కుమారులు ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బాన్సువాడకు విచ్చేశారు. స్పీకర్‌ ప్రత్యేక హెలికాఫ్టర్‌లో బయలుదేరే సమయంలో ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి ఆయన అభినందనలు తెలిపారు.

Updated Date - 2022-10-07T06:13:26+05:30 IST