జయశంకర్‌కు ఘన నివాళి
ABN , First Publish Date - 2022-08-07T05:41:05+05:30 IST
ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు చూడాలని పేర్కొన్నారు. సంతోషకరమైన తెలంగాణ పురోగతిలో ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని సూచించారు.

కామారెడ్డి, ఆగస్టు 6: ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్ శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా అధికారులు చూడాలని పేర్కొన్నారు. సంతోషకరమైన తెలంగాణ పురోగతిలో ఉద్యోగులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఆగస్టు 18న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ను గౌడ కులస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గోపిగౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఎస్సీ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం నిరంతర కృషిని, ఆయన దృడ సంకల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికి మరిచిపోదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అన్యోన్య, అశోక్‌కుమార్, శ్రీనివాస్, సునిల్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో..
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయశంకర్ చిత్రపటానికి ప్రిన్సిపాల్, అధ్యాపకులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం తొలితరం నుంచి అహర్నిశలు పోరాడిన వ్యక్తి అని, ఆయన ఆశ యాలకు అనుగుణంగా తెలంగాణ ఏర్పడిందని ఉద్యమ సమయంలో ఏ రకంగా స్ఫూర్తిదాయకంగా నిలిచాడనే దానిపై ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, జూనియర్ అసిస్టెంట్ గంగా భూషణ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు రవీందర్, పర్వేజ్, వైస్ ప్రిన్సిపాల్ చంద్రకాంత్, అకాడమిక్ కో ఆర్డినేటర్ రాజ్‌కుమార్, అధ్యాపకులు రాణి, శంకర్, గణేష్, రామస్వామి, రామకృష్ణ, జ్యోత్స్న, కృష్ణమోహన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.