ప్రజా సమస్యల పరిష్కారానికే.. వైఎస్సాఆర్‌టీపీ పెట్టా!

ABN , First Publish Date - 2022-10-12T05:22:24+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారానికే.. వైఎస్సాఆర్‌టీపీ పెట్టా!

ప్రజా సమస్యల పరిష్కారానికే.. వైఎస్సాఆర్‌టీపీ పెట్టా!
నిజాంసాగర్‌లో దీక్ష చేపడుతున్న షర్మిల



సీఎం అయితే తొలి సంతకం ఉద్యోగాల భర్తీపైనే


నిజాంసాగర్‌, అక్టోబరు 11:
కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజల సమస్య లను పట్టించుకోనందునే తానువైఎస్సాఆర్‌టీపీని పెట్టానని ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. మంగళవారం నిజాంసాగర్‌ మండల కేంద్రంలో నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ హయాంలో మూడు సార్లు నోటికేషన్‌ ఇచ్చారని, ప్రైవేట్‌పరంగా ఉద్యోగాలు సృష్టించార న్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్రలో మంగ ళవారం నిరుద్యోగ దీక్ష చేపట్టి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ంలో కాంగ్రెస్‌, బీజేపీలు ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం తోనే టీఆర్‌ఎస్‌ ఆగడాలు సాగుతున్నాయన్నారు. అందుకోసమే ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే వైఎస్సాఆర్‌టీపీని పెట్టాన న్నారు. తెలంగాణలో 54 లక్షల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్‌ఆర్‌టీపీ పెట్టక ముందే నిరుద్యోగుల కోసం 72 గంటల దీక్ష చేశామన్నారు. మా పోరాటంతోనే రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఉందని బయటకు వచ్చిందన్నారు.  రాష్ట్రం లో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చి తాను సీఎం అయితే తొలి సంతకం భారీ ఉద్యోగాల భర్తీ మీదనే పెడతానన్నారు. సీఎం కేసీఆర్‌ వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, కార్పొరేషన్‌ ద్వా రా లోన్లు మంజూరు చేయాలని, నిరుద్యోగ సమస్యపై వెంటనే స్పందించాలన్నారు. కేజీ నుంచి పీజీ వరకు విద్య అన్నారే తప్ప అమలు లేదన్నారు. హాస్టళ్లలో అందించే ఆహారం పురుగుల అన్నం, నాసి రకం ఉన్నా సీఎం కేసీఆర్‌ ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు రూ.549 కోట్లతో వైఎస్‌ఆర్‌ ఆధునికీకరణ చేశారని గుర్తు చేశారు. దేవుడు కరుణిస్తేనే నిజాంసాగర్‌ నిండి ఆయకట్టు కింద సిరులు పండుతున్నా యన్నారు.

పాదయాత్ర సాగిందిలా...

నిజాంసాగర్‌ మండలంలో 11 గంటలకు షర్మిల పాదయాత్ర ప్రారంభమైంది. సుల్తాన్‌నగర్‌లో వరి ఽధాన్యాన్ని పరిశీలించి రైతు లతో మాట్లాడారు. ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న నేపథ్యంలో భాగంగా మధ్యాహ్నం 1 గంటల నుంచి 3 గంటల వరకు మండల కేంద్రంలో అంగడిబజార్‌లో నిరుద్యోగ దీక్ష చేప ట్టారు. 4గంటల నుంచి పాదయాత్ర పిట్లం మండలంలోని గద్దగు ండు తండా శివారులోకి 6 గంటలకు చేరుకుంది. మంగళవారం నిజాంసాగర్‌ నుంచి గద్దగుండు వరకు 20 కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగింది. గద్దగుండు శివారులోని దాబా హోటల్‌  సమీ పంలో రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల తర్వా త పిట్లం మండలంలో పాదయాత్ర కొనసాగనుంది. ఆమె వెంట వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి రాంరెడ్డి, జుక్కల్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ అనిల్‌, జుక్కల్‌ ఇన్‌చార్జీ సంజీవ్‌, నాయకులు మనోజ్‌ పాటిల్‌, మోతీలాల్‌ తదితరు లున్నారు.

Updated Date - 2022-10-12T05:22:24+05:30 IST