జిల్లా కేంద్రంలో సినీ ఫక్కీలో చోరీ

ABN , First Publish Date - 2022-10-01T04:44:07+05:30 IST

యాక్టివా డిక్కీలో ఉంచిన రూ.3లక్షల డబ్బులను దుండగులు సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని గంజ్‌ ప్రాంతంలోని ఉదయ్‌ ట్రేడర్‌లో ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

జిల్లా కేంద్రంలో సినీ ఫక్కీలో చోరీ

బైక్‌లో నుంచి రూ.3 లక్షల అపహరణ

ఖిల్లా, సెప్టెంబరు 30: యాక్టివా డిక్కీలో ఉంచిన రూ.3లక్షల డబ్బులను దుండగులు సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శుక్రవారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని గంజ్‌ ప్రాంతంలోని ఉదయ్‌ ట్రేడర్‌లో ప్రవీణ్‌ కుమార్‌ అనే వ్యక్తి కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం అతడి యజమాని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి రూ.3 లక్షలు డ్రా చేసుకొని తీసుకురావాలని చెప్పాడు. దీంతో ప్రవీణ్‌ యాక్టివాపై వెళ్లి బ్యాంకు నుంచి డబ్బులను డ్రా చేసుకొని.. వాటిని యాక్టివా డిక్కీలో పెట్టాడు. అనంతరం దాహం వేయడంతో ఎన్టీఆర్‌ చౌరస్తా వద్ద ఉన్న తన మిత్రుడి ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తాగొచ్చే సరికి డిక్కీ కొంత తెరిచి ఉండగా.. అందులోని డబ్బులు కనిపించలేదు. దీంతో వెంటనే ఒకటో టౌన్‌ పోలీసులకు ప్రవీణ్‌ ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో విజయ్‌బాబు తెలిపారు. 

Read more