అంగన్వాడీ ఉద్యోగులకు పనిభారం తగ్గించాలి
ABN , First Publish Date - 2022-03-05T06:09:30+05:30 IST
: అంగన్వాడీ టీచర్లకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పెర్కిట్‌లోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఆర్మూర్‌రూరల్, మార్చి4: అంగన్వాడీ టీచర్లకు పనిభారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పెర్కిట్‌లోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీచూ జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేష్‌బాబు, మాజీ అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ పారదర్శక విధానం పేరిట ఏ వ్యవస్థలో లేని విధంగా అంగన్వాడీ టీచర్లు రోజు ఆన్లైన్లో గర్భిణులు, బాలింతలు పసి పిల్లల ఫొటోలు తిసి ఎప్పటి కప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలని అధికారులు ఒత్తిడి చేయడం శోచనీ యమన్నారు. దీని మూలంగా అనేక మంది అంగన్వాడీ టీచర్లు ఆన్లైన్ విధానం అర్థం కాక, సిగ్నల్స్ లేక, సర్వర్ పని చేయక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి యాప్ రద్దు చేసి పని భారం తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు బకాయి ఉన్న వేతనాలు, కేంద్రాల అద్దెలు, ఇతర బకాయిలను చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రాజెక్టు అఽధ్యక్షురాలు చంద్రకళ, గోదావరి, లక్ష్మి, అరుణ, సునంద, వసంత పాల్గొన్నారు.