ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

ABN , First Publish Date - 2022-03-05T06:07:48+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమ స్యలపై ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి


కమ్మర్‌పల్లి/ మోర్తాడ్‌, మార్చి 4: 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ సమ స్యలపై ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని రైతు ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు పంటకు మద్దతు ధర కల్పించాలని యాసంగి వరితో పాటు అన్ని పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌, జగిత్యాల రైతు ఐక్యకార్యచరణకమిటీ సభ్యులు చేపట్టిన పాదయాత్రకు కమ్మర్‌పల్లి మండల రైతులు సంఘీభావంతెలిపారు. గురువారం సాయంత్రం కమ్మర్‌పల్లి చేరుకున్న పాదయాత్రకు స్థానిక రైతు సంఘాలు విడది ఏర్పటుతో పాటు సుమారు 150 మందికి భోజన సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముత్యంపేట్‌ ఫ్యాక్టరీ నుంచి నిజామాబాద్‌ మార్కెట్‌ కమిటీవరకు చేపట్టిన పాదయాత్రలో పార్టీలకు అతీతంగా రైతులు కలిసి రావాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. గతంలో కల్వకుంట కవిత పార్లమెంట్‌లో ఈ అంశాన్ని లేవనెత్తారని, సంబంధిత మంత్రిని కలిసి తనవంతు ప్రయత్నం చేశారన్నారు. అధికారంలో ఉన్న ఎంపీ అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చినా కనీస ప్రయత్నం చేయలేదన్నారు. ఇప్పటికైనా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కమ్మర్‌పల్లి నుంచి బయలుదేరిన జగిత్యాల జిల్లా రైతు వేదిక, నిజామాబాద్‌ జిల్లా రైతు ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర మోర్తాడ్‌కు చేరుకుంది. మోర్తాడ్‌ జాతీయ రహదారిపై గాండ్లపేట్‌, పాలెం రైతులు ఉద్యమకారులకు పూలమాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు వి. ప్రభాకర్‌ మాట్లాడుతూ ఉద్యమాల ద్వారానే రైతుల సమస్యల పరిష్కార మవుతాయని అన్నారు. కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, ప్రభాకర్‌, దేవారాం, సత్యనారాయణ, దేగాం యాదాగౌడ్‌, శ్రీనివాస్‌ రెడ్డి,  ప్రవీణ్‌,  నారాయణ రెడ్డి, దేవరాం, సురేష్‌, కిషన్‌, ఎ.రాజేశ్వర్‌, గంగారెడ్డి, కిషన్‌, జగిత్యాల జిల్లా చెరుకు ఉత్పత్తిదారుల అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డి, బోజాల రాజారెడ్డి, బద్దం శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:07:48+05:30 IST