వాగులో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-03-06T04:55:25+05:30 IST

తన తమ్ముళ్లతో కలిసి వంట చెరుకు కోసమని వెళ్లి దాహం తీర్చుకోవడానికి వాగులోకి వెళ్లి నీటి మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన మమ్మాయి విఠల్‌(52) తన తమ్ముళ్లు అంజయ్య, కిష్టయ్యలతో కలిసి గ్రామ శివారులోని ర్యాగలవాగు సమీపంలోకి వెళ్లారు.

వాగులో పడి వ్యక్తి మృతి

బీర్కూర్‌, మార్చి 5: తన తమ్ముళ్లతో కలిసి వంట చెరుకు కోసమని వెళ్లి దాహం తీర్చుకోవడానికి వాగులోకి వెళ్లి నీటి మునిగి ఓ వ్యక్తి మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దామరంచ గ్రామానికి చెందిన మమ్మాయి విఠల్‌(52) తన తమ్ముళ్లు అంజయ్య, కిష్టయ్యలతో కలిసి గ్రామ శివారులోని ర్యాగలవాగు సమీపంలోకి వెళ్లారు. కట్టెలను కొట్టిన అనం త రం నీటిని తాగడానికి వాగు దగ్గరికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో మునిగిపోయాడు. విఠల్‌ను బయటికి తీసి బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందు తూ విఠల్‌ మరణించాడు. భార్య ఈరవ్వ ఫిర్యాదు మేరకు ఏఎస్సై సితరామమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Updated Date - 2022-03-06T04:55:25+05:30 IST